– మహీంద్రా ట్రక్స్ వెల్లడి
పూణె: గడిచిన జులైలో నాలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఐదు డీలర్‌షిప్‌లను ప్రారంభించినట్లు మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీటీ) తెలిపింది. ఇందులో ఒకటి ఏపీలోని కడపలో నవత ఆటోమోటివ్స్ ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఈ డీలర్‌షిప్‌లలో రోజుకు 75పైగా వాహనాలకు సర్వీసులు అందించేలా 37 సర్వీసు బేలు ఉన్నాయని పేర్కొంది.