ఉచిత దంత వైద్య శిబిరం …

– కింగ్ కోఠి క్లస్టర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ
నవతెలంగాణ -సుల్తాన్ బజార్:
విద్యార్థులు దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కింగ్ కోఠి క్లస్టర్ డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ పద్మజ అన్నారు. బుధవారం రోహిణి పౌండేషన్, ఆర్ బి ఎస్ కే కింగ్ కోఠి క్లస్టర్  సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 450 మంది విద్యార్థులకు దంత, రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. రక్తహీనత ఉన్న విద్యార్థినీలను గుర్తించి వారికి పోషకాహార లోపాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మందులు, డెంటల్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ రమేష్, రోహిణి పౌండేషన్ చైర్మన్ డాక్టర్ సి.హెచ్ సంపత్ రెడ్డి, డాక్టర్ హారిక, డాక్టర్ సోఫియా, పి. నర్మదా, ఫర్హాన్, ఫార్మసీ అలేఖ్య, కృష్ణవేణి, సుధాకర్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులుపాల్గొన్నారు
Spread the love