బీజేపీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిని భగ్నం చేసిన పోలీసులు

నవతెలంగాణ – మీర్ పేట్
బీఅమలుకై ఉద్యమం) అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి అందేలా శ్రీరాములు ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అప్పటికే అక్కడికి ఉన్న పోలీసులు వచ్చిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి ఘట్కేసర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్స్, పెన్షన్స్, రేషన్ కార్డులు, దళిత, బీసీ బంధు, నిరుద్యోగభృతి ఇవ్వకుండా కుటుంబ పాలన చేస్తూ నియంత పాలన చేస్తున్నాడని ఆరోపించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో మీర్ పేట్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Spread the love