ఘనంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఔట్ సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర మహాసభ..

– పాల్గొన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు  ప్రభుత్వ ఉద్యోగుల కు ఇచ్చిన తరహాలోనే పిఆర్ సి ఇచ్చిన ఘనత రాష్ట్ర  సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం కోఠి డిఎంహెచ్ఎస్ ఆవరణలో తెలంగాణ వైద్య వైద్య ఆరోగ్య ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్  ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఔట్ సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర మహాసభ నిర్వహించారు ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ ను చిరు ఉద్యోగులుగా గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి తగిన వేతనాలను అందించేలా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ శాఖలలో సేవలందిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి నిరాశ చెందకుండా ఉండేలా కనీస వేతనాలను కచ్చితంగా అందించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారని అన్నారు. ఆరు నుంచి ఎనిమిది వేల వరకు వేతనాలు పొందుతున్న చిరు ఉద్యోగులకు రాష్ట్రం ఏర్పడిన అనంతరం  వేతనాలు పెంచి అందిస్తున్నామన్నారు. ఉద్యోగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరిని వారి వారి శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా అందుతుందని తెలిపారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏకైక లక్ష్యం క్రమబద్ధీకరణే కానీ మొదటగా వేతనాలు పెంచుకునేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు  యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రంలో అతిపెద్ద శాఖ అంటే వైద్య ఆరోగ్యశాఖనేనని ఈ శాఖలో  రెగ్యులర్ ఉద్యోగులు 30 వెలు ఉంటే. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 75 వేల మంది ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కనీస వేతన బోర్డు చైర్మన్ పి నారాయణ. సభ్యులు శివశంకర్. రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్. వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ ఓదిన్, కోశాధికారి సుభాష్, డాక్టర్ శాంతి కుమార్, నర్సింగ్ రావు, వెంకట్ నారాయణ రాథోడ్, సరిత, ప్రవళిక, వివిధ జిల్లాల ఉద్యోగుల తదితరులు పాల్గొన్నారు
Spread the love