గుర్తుతెలియని ఆడమనిషి శవం లభ్యం

– ఆరవ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెల్లడి
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తుతెలియని ఆడమనిషి శవం లభ్యమైనట్లు ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొగులయ్య ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఆడమనిషి సోము ఉందని సమాచారంతో ఘటన స్థలానికి వెళ్ళగా అందగా 35 నుండి 45 సంవత్సరాలు మధ్యలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన మృతురాలు పై రెడ్ కలర్ చీర రెడ్ కలర్ జాకెట్ ధరించి ఉందని బిలాల్ నగర్ కట్ట నిజాంసాగర్ కెనాల్ సారంగాపూర్ ఎవరైనా గుర్తు పడితే ఆరో పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వగలరని ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొగులయ్య తెలిపారు.
Spread the love