బీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది..

– అవినీతికి భూకబ్జాలకు పాల్పడేది బీఆర్ఎస్.
– ప్రారంభోత్సవాలు కాదు.. అభివృద్ధి చేయాలి.
– కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం. 
– టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి.
నవతెలంగాణ – ఊరుకొండ 
అవినీతి అక్రమాలకు భూ కబ్జాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని.. ధరణి పేరుతో ఎన్నో భూకబ్జాలు.. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు కబ్జాలు చేసి ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి అధ్యక్షతన చేపడుతున్న ప్రజాహిత పాదయాత్రలో భాగంగా ఊర్కొండ మండలంలోని జకినాలపల్లి నుండి ఊరుకొండ పేట, ఊరుకొండ గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికి మహిళా మణులు హారతి ఇచ్చారు. అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. ఊరుకొండ మండల కేంద్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాలు లేవు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కనీసం హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. నాడు డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు 5 లక్షలు ఇస్తామని.. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఐదు లక్షలు కాస్త మూడు లక్షలు గా మార్చారని దుయ్యబట్టారు.  కల్లబొల్లి కథలు చెప్పి.. అమలు చేయని ఎన్నో హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడం తప్ప తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులకు 4వేల వృద్ధాప్య పింఛన్, రెండు లక్షల రైతుల రుణమాఫీ, రైతుబంధు ఎకరానికి 15వేలు, 500 కి గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఊరుకొండ మండలంలో అభివృద్ధికి నోచుకోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. అనంతరం ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమై 250 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఊరుకొండ బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి.. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పిటిసి రబ్బాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, గోపి నాయక్, కుంభగోని వెంకటయ్య గౌడ్, రమేష్ నాయక్, సత్యనారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,  అయ్యుబ్ పాషా, కంఠం విజయ్, సమ్మి, గోపాల్, మల్లేష్, యాదయ్య, గణేష్, దయాకర్, కార్యకర్తలు, అభిమానులు, ఆయా గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love