నవతెలంగాణ -జక్రాన్ పల్లి
మండలం వివేక్ నగర్ తండా గ్రామపంచాయతీలో ఆదివారం గిరిజనులు ఘనంగా తీజ్ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా జక్రాన్ పల్లి మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ సింగ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బంధువులతో కలిపి నిర్వహించే తీజ్ పండుగ ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పాడి పంటలు, పిల్ల పాపలు, బందు మిత్రులు అందరూ ఆనందంగా ఉండాలని తీజ్ పండుగ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సభ్యురాలు జమున, సర్పంచ్ దూళి భాయ్ ఉపసర్పంచ్ వెంకటేష్ తండా నాయకులు తదితరులు పాల్గొన్నారు.