బీఆర్ఎస్ హైట్రిక్ కొట్టడం ఖాయం..

– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– బీఆర్ఎస్ లో చేరిన రంగారెడ్డి జిల్లా బిజెపి మహిళ మోర్చా కార్యదర్శి
నవతెలంగాణ – మీర్ పేట్
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం హైట్రిక్ కొట్టడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని 28,33వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. అందరికంటే ముందుగా ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే అభ్యర్థులు ప్రకటించడం చాలా గొప్ప విషయం అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల అభివృద్ధిలో పాల్పంచుకుంటూ ఉంటున్నాము కాబట్టే ప్రజలపై నమ్మకంతో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మహిళ కార్యదర్శి బీఆర్ఎస్ లో చేరిక..
రంగారెడ్డి జిల్లా బీజేపీ మహిళ మోర్చా కార్యదర్శి జె అనిత నాయక్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిజెపి నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
Spread the love