కురుమలకు ఎమ్మెల్యే టికెట్లు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలను భూస్థాపితం చేస్తాం..

–  కురుమ సంఘం.
నవతెలంగాణ – ధూల్ పేట్ 
 కురుమ కులస్తులకు రాజకీయంగా చట్ట సభల్లో ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వవని పార్టీలకు కురుమలంతా ఏకతాటిపై వచ్చి భూస్థాపితం చేస్తామని తెలంగాణ కురుమ సంఘం ఉపాధ్యక్షులు కౌశివ శ్రీనివాస్ రావు, మిర్రర్ శ్రీనాథ్, మాధారం కృష్ణలు హెచ్చరించారు. ఈ మేరకు ఆఫ్గంజ్లోని కురుమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా జనభా ఉన్న కురుమలకు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 115 స్థానాల్లో ఒక సీటు కూడా కురు మ కులానికి చెందిన నాయకుడికి ఇవ్వకపోవడం తమ కులాన్ని చిన్నచూపు చూడటమేననని వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం తమ కులానికి పెద్ద అయిన యెగె మల్లేషంకు ఎమ్మెల్సీ కట్టబెట్టి చేతులు దులుపుడుతుందన్నారు. ఈ విషయంపై యెగ్గె మల్లేషం స్పందించి బీఆర్ఎస్ పార్టీ కురుమలకు చేసిన అన్యాయంపై అధికారికంగా తీవ్రంగా ఖండించాలని వారు డిమాండ్ చేశారు. త్వరలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో జనభా ప్రకారం 5 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తనకు ప్రాధాన్యత ఇచ్చిన రాజకీయ పార్టీలను 30 జిల్లాల్లో పర్యటించి తమ కురుమ కులస్తుల ఓట్లతో ఆ అభ్యర్ధులను తప్పకుండా గెలిపించుకొని తిరుతమాని తెలిపారు. తమకు టికెట్లు ఇవ్వని పార్టీలను భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. గోషామహల్ నియోజకవర్గానికి చెందిన ఉద్యమ నాయకుడు, వీఆర్ఎస్ నాయకుడు బికిని శ్రీనివాస్ కు ఎమ్మెల్యే టికెట్ లను పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తే తప్పకుండా గోషామహల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు తాము కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు శీలంపల్లి సురేశ్, దేవర చంద్రశేఖర్, చిగుమల్ల బాలగోపాల్, అడికె సంతోష్ రావు, మాణిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
Spread the love