బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రెండు వేలు జరిమానా..

– కమిషనర్ అల్లూరి వాణి
నవతెలంగాణ – మీర్ పేట్
పరిసరాలను అపరిశుభ్రంగా చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన చెత్త వేస్తే రూ 2వేలు జరిమాన విధిస్తామని మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ అల్లూరి వాణి అన్నారు. శుక్రవారం శానిటేషన్ ఇన్స్పెక్టర్ నర్సింహా ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలో మంత్రాల చెరువు పక్కన ఆర్సీఐ రోడ్డు పక్కన చెత్త వేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని రూ 2 వేలు జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశంలో చిత్తవేయకుండా ప్రతి ఇంటికి చెత్త బండి రాగానే చెత్త బండిలో చెత్తను వేయాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానలే కాకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది మహేందర్, రాజు తదితరులు ఉన్నారు.
Spread the love