మోఖం చాటేసిన వర్షాలు..

– ఆందోళన చెందుతున్న రైతులు
నవతెలంగాణ- పెద్ద కొడపగల్
మండలంలోని రైతులు దాదాపు 20 రోజుల నుండి వర్షాలు పడక పోవడంతో రైతన్నలు దిగులు పడుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ నెల చివరిలో కూడా వర్షాలు మోఖం ఛాటేయడంతో కరీబ్ పంటలు పండే  అవకాశం లేదని రైతులు అంటున్నారు.జులై నెలలో కురిసిన వర్షాలకు వేసుకున్న పంటలు  ఇప్పుడు వర్షాలు లేక ఎండి పోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. దింతో చేసేది ఏమిలేక రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు ఎప్పుడెప్పుడు కురుస్తాయని చూస్తున్నారు.కొందరు రైతులు అయితే పక్కనే ఉన్న పంట పొలంలో ఉన్న బోరు బావిల నుండి డ్రీప్ సహాయంతో పంటలను తడపుతున్నారు.దింతో ఎంతో కొంత పంట చేతికి వస్తాయని  తెలుస్తోంది.
Spread the love