నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యాధికారి ఎం.వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు డాక్టర్ సంగీత ఆధ్వర్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల రోగాలకు సంబంధించిన 76 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, డెంగ్యూ, మలేరియా సంబంధిత పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మందులు ఇవ్వడం జరిగిందని వైద్యాధికారి తెలిపారు. వర్షకాలంలో సీజనల్ వ్యాధులపై పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, హెల్త్ సూపర్ వైజర్, హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎమ్స్, ఆశలు పాల్గొన్నారు.
కొయ్యూరులో ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



