పడంపల్లి జీపీ లో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాది టీకాలు..

– గ్రామసర్పంచ్ గణేష్ పటేల్..

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడంపల్లి గ్రామములో బుదువారం నాడు పశువులకు ఉచిత గాలీకుంటు వ్యాది టీకాలు సర్పంచ్ గణేష్ పటేల్ చేతుల మీదుగా టీకా వేల సి ప్రారంబించారు.ఈ సంధర్భంగా సర్పంచ్ గణేష్ పటేల్, వెటర్నరి సిబ్బంది మాట్లాడుతు  గాలీకుంటు వ్యాది ఉచితంగా రాష్ట్ర పశు వైద్యశాఖ అధ్వర్యంలో జిల్లాఅధికారుల ఆదేశాల మేరకు గ్రామాలలో ఆగస్టు చివరి వారం వరకు గాలికుంటు షెడ్యుల్ ప్రకారం గ్రామాలలో క్యాంపులు ఏర్పాటు చేసి గాలీకుంటు ఉచిత టీకాలు ఇవ్వడం జర్గుతుందని , గాలీకుంటు వ్యాది సోకిన పశువులకు మంద నుండి వేరు చేయాలని, ముక్కు నుండి జీగురు లాంటి పద్దార్థం కారుతుందని, కాళ్ల సందులలో పగుళ్లు ఏర్పడుతాయని, మేత మేయక పోవడం వలన ప్రాణం పోయే స్థితిలో ప్రమాదం పొంచి ఉందని , పశు సంపద ఉన్న రైతులు తప్పక గాలీకుంటు వ్యాది టీకాలు వేయడం పరిచి పోవద్దని పేర్కోన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ , పశు వైద్య సిబ్బంది, పాడి రైతు  మలుగొండ, గ్రామస్తులు   తదితరులు పాల్గోన్నారు.
Spread the love