మొదటినుంచి పార్టీలో ఎంపీకి దక్కని గౌరవం

– కేటీఆర్ సభలో కనిపించని ఎంపీ

– రైతు సమితి జిల్లా అధ్యక్షులు , మాజీ మున్సిపల్ చైర్మన్
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రస్తుతం నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పి.రాములుకు భారత రాష్ట్ర సమితిలో మొదటినుంచి గౌరవం దక్కడం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యునిగా కేసీఆర్ అవకాశమిచ్చారు. గెలుపొందారు ప్రస్తుతం ఎంపిక కొనసాగుతున్నారు. కుమారుడు భరత్ ప్రసాద్ కల్వకుర్తి జెడ్పీటీసీగా గెలుపొందారు. నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వులకు కేటాయించడంతో భరత్ ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నం చేశారు. రాములు తన కుమారుడికి జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్లారు. జడ్పీ చైర్మన్ భరత్ ప్రసాద్ అంటూ పత్రికల్లో కథనాలు వెలుపడ్డాయి. రాత్రికి రాత్రి చైర్మన్ పదవి పేరు మారిపోయింది.  అప్పటి అచ్చంపేట  ఎమ్మెల్యే  ఉన్న గువ్వల బాలరాజు భరత్ ప్రసాద్ జడ్పీచైర్మన్ కాకుండా అడ్డుకున్నాడని భరత్ ప్రసాద్ , ఎంపీ రాములు ఆరోపించారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీలకు మధ్య తీవ్ర వివాదం నెలకొంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ రాములు సైలెంట్ గా ఉన్నారు. ఈయన వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ కు  అనుకూలంగా సహకరించినట్లు చేసినట్లు పట్టణంలో చర్చ జరిగింది. పట్టణంలో ఒకరోజు భరత్ ప్రసాద్ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. తన నియోజకవర్గంలో తన ఫోటో లేకుండా ఎలా ఫిక్స్ చేస్తారని గువ్వల బాలరాజు  నేరుగా ఎంపీ రాములు కు ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ ఆడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడు నెలలు కావస్తుంది రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంపీ రాములు అచ్చంపేటకు రాలేదు. ఆదివారం అచ్చంపేటలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. విషయనికి కూడా ఎంపీ రాములు హాజరు కాలేదు. తనకు ఆహ్వానం లేదని, అందుకే సమావేశానికి రావడం లేదని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఎంపీ రాములు పార్టీ మారుతున్నట్లు ప్రచారం ముమ్మారంగా జరుగుతుంది. నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా ఏ పార్టీ అవకాశమిస్తే ఆ పాటలోకి మారే అవకాశం ఉందని ఆయన అనుచరులు , స్నేహితులు, పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
Spread the love