భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నర్సింహకు సంపూర్ణ మద్దతు

 – అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్సీ.
నవతెలంగాణ- భువనగిరి: నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కొండమడుగు నర్సింహ కి నా సంపూర్ణ మద్దతు  తెలిపారు సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక, సామాజిక అసమానతలు భారీగా పెరిగిపోతున్న క్రమంలో, అసమానతలు తొలగించుటకు కృషిచేస్తున్న కమ్యూనిస్టుపార్టీ అభ్యర్థిగా నర్సింహ పోటీలో యున్నారన్నారు. నేను ఉపాధ్యాయ నియోజకవర్గము నుండి ఇండిపెండెంటు అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికైన నాటి నుండి ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగిపోవాలని, ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని కృషి చేస్తున్నానారు. కొండమడుగు నర్సింహ అదే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. అందువల్లనే నర్సింహ కి నా సంపూర్ణ మద్దతు తెల్పుతూ, భువనగిరి నియోజకవర్గ ప్రజలు తమ ఓటును వేసి నర్సింహ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయటానికి కేంద్రంలో పాలన చేస్తున్న పార్టీ గానీ, రాష్ట్రంలో పాలిస్తున్న పార్టీ గానీ ఎలాంటి ప్రయత్నం చేయటం లేదన్నారు. ఈ విధానం వలన ప్రభుత్వాలకు కూడా ఎలాంటి ప్రయోజనము లేదు. ఈ పథకంలో ఉద్యోగుల వాటా, ప్రభుత్వ వాటా డబ్బు మొత్తాన్ని పెట్టుబడిదారులకు అప్పనంగా అర్పించడమే కన్పిస్తుంది. కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని నికరంగా వ్యతిరేకించినవని తెలిపారు. వాటికి అవకాశమున్న 2004 నుండి 2009 వరకు ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా నిలువరించాయన్నారు. కార్మికవర్గ పోరాటాలు ఉధృతంగా జరిగిన కాలంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కులు, సౌకర్యాల కొరకు ప్రభుత్వాలతో బేరసారాలాడే శక్తి పెరిగింది. తద్వారా పాత పెన్షన్ విధానాన్ని సాధించుకున్నారు.
కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం ద్వారా అంబానీ, ఆదానీ లాంటి కొద్ది మంది పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరుస్తూన్నారు. వారిని లక్షల కోట్లకు అధిపతులను చేస్తుందన్నారు. ఈ తొమ్మదిన్నర సంవత్సరాల కాలంలో వంద లక్షల కోట్లు అప్పు చేసి, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందన్నారు. దేశ ప్రజల తల ఒక్కంటికి లక్షన్నర అప్పును పెట్టింది. తద్వారా ఆర్థిక అంతరాలు ఇంకనూ పెరిగిపోతున్నాయన్నారు. ఆర్థిక, సామాజిక అంతరాలను తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషించేది ‘ విద్య ‘. నూతన విద్యా విధానము-2020 ద్వారా కె.జి. నుండి పి.జి. వరకు ప్రభుత్వ రంగములో మిగిలియున్న విద్యను ప్రైవేటుపరం చేయడానికి కృషి చేస్తున్నదన్నారు. అందుకొరకు కేంద్ర బడ్జెట్లో విద్యకు కొఠారీ కమిషన్ సూచించిన 10 శాతం కాకుండా తగ్గిస్తూ 2023-24 బడ్జెట్లో 2.67 శాతానికి తీసుకువచ్చిందన్నారు  చదువు కొనవలసిందే తప్ప, డబ్బులు లేనివారు చదువుకునే పరిస్థితి లేకుండా చేసింది. మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా సామాజిక భద్రత లేకుండా చేస్తుంది. ఆరోగ్య రంగములో తన స్వంత స్కీములను ప్రవేశపెట్టుట ద్వారా, ఉన్న కాస్త ఆరోగ్య సేవలకు ఆటంకాలు కలుగుతున్నాయి. తద్వారా ప్రజలు ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించవలసి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వారు కేంద్ర ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా కార్మికుల వేతనాలు సవరించుటకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదు. తద్వారా పెరుగుతున్న ధరలకనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగలేదున్నారు. తలసరి ఆదాయం మూడింతలైందని గొప్పలు చెప్పుకునే వీరు కార్మికుల వేతనాలు మూడురెట్లు ఎందుకు పెంచలేదనే ప్రశ్నకు సమాధానము చెప్పరన్నారు. నాల్గవ తరగతి ఉద్యోగాలైన ఆఫీసు సబార్డినేటు పోస్టులలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని అమలు చేస్తూ అరకొర జీతాలు చెల్లిస్తున్నారుఆవేదన వ్యక్తపరిచారన్నరు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలే ఆఫీసు సబార్డినేటు పోస్టులలో పనిచేయుటకు ముందుకు వస్తారు. ఈ పోస్టులలో పని చేసేవారికి వేతన స్కేళ్ళు అమలు చేస్తే, ఆ కుటుంబాలకు ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. తద్వారా ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గుతాయి.
ప్రభుత్వరంగ విద్యలో ప్రధానమైన ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్ పాఠశాలల్ని వదిలేసి, కొత్తగా 650 గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేసి, గతంలో ఉన్న వాటితో కలుపుకొని 10 ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఊదరగొడ్తున్నారు. ఈ గురుకులాలలో మొత్తం అడ్మిషన్లు నాలుగు లక్షల ఎనభై వేలు, వాస్తవంగా చేరిన వారు నాలుగు లక్షల యాబై వేలే. అరవై లక్షల మంది విద్యార్థులున్న తెలంగాణలో నాలుగు లక్షల యాభై వేల మందికి ‘ విద్య ‘ నందిస్తే సరిపోతుందా? మిగిలిన యాబై ఐదు లక్షల విద్యార్థుల సంగతేమిటి? ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్ పాఠశాలల్ని అభివృద్ధి చేయుట ద్వారానే బాల, బాలికలందరికీ ఉచిత, నాణ్యమైన విద్యను అందిచవచ్చును. ప్రక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలో 80 శాతం పైగా విద్యార్థులు ప్రభుత్వ బడులలో చదువుతుంటే, తెలంగాణలో 45 శాతం విద్యార్థులే ప్రభుత్వ బడులలో చదువుచున్నారు. అటు అమెరికా దేశంలో 91 శాతం, ఇటు చైనాలో 100 శాతం విద్యార్థులు ప్రభుత్వ బడులలో చదువుచున్నారు. ఏ లెక్క తీసినా తెలంగాణ దిగదుడుపేనన్నారు. . గతంలో దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలిన పార్టీ కూడా, గత విధానాలకు భిన్నమైన విధానాలను అనుసరించి, దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అంతరాలను తగ్గిచేందుకు, క్రమంగా అంతరాలు లేకుండా చేస్తామనే విధాన ప్రకటనలు చేయటం లేదన్నారు అందరు అధికార కుర్చీ కొరకే తాపత్రయపడ్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రజలను మభ్యపెడ్తున్నారు. పై మూడు పార్టీలు ఆకలైతే అన్నం పెడ్తామంటున్నారు. తప్ప, అన్నం సంపాధించుకునే విధానాలను అవలంభిస్తామని చెప్పటం లేరన్నారు. అందువల్లనే భిన్నమైన విధానాలతో ఆర్థిక, సామాజిక అంతరాలను తొలగించుటకు కృషి చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీలో యుండి, ఇప్పటికే అట్టి కృషి చేస్తున్న కొండమడుగు నర్సింహ కి మీ విలువై ఓటువేసి గెలిపించాలని భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నరసింహ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్ నాయకులు వడ్డబోయిన వెంకటేష్, ఈర్లపల్లి ముత్యాలు పాల్గొన్నారు.
Spread the love