సీపీఐ(ఎం) మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య కన్నుమూత

నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య(81) సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రయివేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బంకురా నియోజకవర్గం నుంచి ఆయన 9సార్లు పార్టమెంట్ సభ్యులుగా పని చేశారు.  సీఐటీయూ నాయుకుడిగా, సీపీఐ(ఎం) కేంద్ర కమిటి సభ్యుడిగా సేవలందించారు.  నిరంతరం కార్మికుల హక్కుల కోసం, పేదల కోసం పని చేసిన వ్యక్తి బాసుదేవ్ ఆచార్య. మాజీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా పని చేశారు. వయోభారం కారణంగా చాలా కాలంగాఅనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కుమార్తె ఇంట్లో ఉంటున్నారని, ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారని, అంత్యక్రియలు పశ్చిమబెంగాల్ లో నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
కార్మికోద్యమానికి ఆయన మరణానికి తీవ్ర లోటు: సీఐటీయూ
కామ్రేడ్ బాసుదా ఆచార్య మరణం ఐక్యకార్మిక ఉద్యమానికి తీవ్ర నష్టం. అనేక కార్మిక పోరాటాలను ఆయన ముందుండి నడిపించారు. కార్మికోద్యమానికి ఆయన మరణానికి తీవ్ర లోటు. ఆయన కుటుంబానికి  సీఐటీయూ జాతీయ కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలిపింది.
సీపీఐ(ఎం) స‌తాపం..
కార్మికులు, ఉద్యోగుల సమస్యలు, హక్కులపై పార్లమెంట్‌లో తనదైనశైలిలో తన గళం వినిపించారు. అనేక పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో వివిధ హౌదాల్లో పనిచేసారు. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ కార్మికుల హక్కులకోసం నిరంతర పోరాటాలు నడిపారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా జీవితమంతా సాధారణ జీవితం గడిపారు. వీరి మరణం పార్టీకి, కార్మిక ఉద్యమాలకు తీరని లోటు. వాసుదేవ ఆచార్య భార్య డిఏవి స్కూల్‌లో పనిచేసి ఇటీవల మరణించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భౌతికకాయాన్ని సీఐటియు అఖిల భారత నాయకులు ఎం సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు సందర్శించి నివాళులర్పించారు.

Spread the love