గద్దర్‌.. ఓ మహౌన్నత వ్యక్తి

– స్మతి వనం ఏర్పాటు పై ప్రభుత్వానికి లేఖ రాస్తా
– కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క
– తెల్లాపూర్‌లో ప్రజాయుద్ధ నౌకకు ఘన నివాళి
నవతెలంగాణ-రామచంద్రాపురం
ప్రజా గాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గద్దర్‌ ఓ మహౌన్నత వ్యక్తి అని కాంగ్రెస్‌ శాససభా పక్ష నేత భట్టి విక్రమార్క అన్నారు. తెల్లాపూర్‌ గద్దర్‌ బలగం ఆధ్వ ర్యంలో సంతాపసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బట్టి విక్రమార్క విచ్చేసి ప్రసంగించారు. గద్దర్‌ భౌతికంగా మన మధ్య లేకపో యిన ప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపో తారన్నారు. సమాజంలోని ప్రతీ వ్యక్తి సమానంగా ఎదగాలని, సమానంగా చూడాబడాలని, సమా నంగా గౌరవించబడాలని, అందరికీ అన్ని హక్కులు రావా లని కాంక్షించే గొప్ప వ్యక్తి గద్దర్‌ అని కొనియాడారు. పేదలకు ఇచ్చిన భూములను నేటి పాలకులు లాక్కొని ధన వంతులకు, బడా సంస్థలకు ధారా దత్తం చేస్తున్నారని, తిరిగి వాటిని పేదలకు పంపిణీ అయ్యేలా చూడాలని ఎప్పటికీ గద్దర్‌ పోరాడేవారన్నారు. పేదల ఆకలి కేకలను నిలువరిచేందుకు కోసం గద్దర్‌ తన చివరి శ్వాస వరకు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ యన పాడిన పాటలు ఆటలు.. మాట్లాడిన మాటలు తెలం గాణ ప్రజలను ఎంతగానో ఆకర్షించి పోరాట ఉద్య మాన్ని మరింతగా ముందుకు పోయేల చేశాయన్నారు. తెలంగాణ సాధనలో ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా విచిపోతుం దన్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్‌ గలానికి మరణం లేదని భౌతికంగా మాత్రమే ఆయన మన మధ్యలో లేరని తెలా ్లపూర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ కొల్లూరి భరత్‌ అన్నారు. శబ్దాన్ని ఆపేశక్తి ఎవరికీ లేదని, శబ్దం గళం రాజకీయ పార్టీలకంటే గొప్పవని గద్దర్‌ చెప్పేవారన్నారు. గద్దర్‌కు చావు లేదు.. గద్దర్‌ అంటే పాట కాదు.. గద్దర్‌ అంటే 40 ఏళ్లు రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా గద్దర్‌ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాయకుడు ఏఊరి సోమన్న తన ఆటపాటలతో అక్కడికి వచ్చిన వారందరినీ ఎంతగానో ఆలరించారు. ఈ కార్యక్రమంలో గద్దర్‌ కుమార్తె వెన్నెల, కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ పార్లమెంట్‌ ఇంచార్జ్‌ గాలి అనిల్‌ కుమార్‌, పటా న్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాట శ్రీనివాస్‌ గౌడ్‌, కార్మిక నాయ కులు కొల్లూరి సత్య, బిఎస్పి ఇన్చార్జి బాలయ్య, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, ఇన్నారెడ్డి, రఘునాథ్‌ యాదవ్‌ కష్ణ ,బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు మంజుల, పావని నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, రవీందర్‌, రమేష్‌, బాబు గౌడ్‌, జహీర్‌, తూర్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Spread the love