నటరాజ నృత్యానికేతన్ నాట్య గురువు బాశెట్టి మృణాళిని ఆధ్వర్యంలో గజ్జపూజ కార్యక్రమం 9 మంది విద్యార్థులతో బుధవారం నిర్వహించడం జరిగింది. నృత్యానికేతన్ వ్యవస్థాపకులు మాడవేటి నారాయణ ఆధ్వర్యంలో, పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో చిన్నారులకు గజ్జపూజ కార్యక్రమం ఆనందకర వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.