Thursday, June 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధం ముగిస్తే గ్యాస్‌ ధరలు తగ్గుతాయి : ట్రంప్‌

యుద్ధం ముగిస్తే గ్యాస్‌ ధరలు తగ్గుతాయి : ట్రంప్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : ఇరాన్‌ యుద్ధం ముగిస్తే అమెరికాలో గ్యాస్‌ ధరలు తగ్గుతాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. బుధవారం ప్రసారమైన ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ద్రవ్యోల్బ ణం అంత ఎక్కువగా లేదని అన్నారు. కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్‌ జరిపిన డ్రోన్‌, క్షిపణి దాడిలో ఒక వ్యక్తి మర ణించగా పలువురు గాయ పడ్డారంటూ వార్తలు వచ్చిన తర్వాత ట్రంప్‌ ఇంటర్వ్యూ ప్రసార మైంది. ‘మనకు పెద్దగా ద్రవ్యోల్బణం లేదు. చూడండి…మీరు కేవలం పెట్రోల్‌ ధరను…అంటే ఇంధన ధరను పక్కన పెట్టి చూస్తే మనకు ద్రవ్యోల్బ ణం తక్కువగానే ఉంది’ అని తెలిపారు. భారత్‌, చైనాలపై 12.5

శాతం సుంకం : అమెరికా ప్రతిపాదన
భారత్‌, చైనా సహా 60 దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై 12.5 శాతం సుంకాన్ని విధించాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది. బలవంతంగా కార్మికులతో పనిచేయించి ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతులపై నిషేధం విధించ డంలోనూ, నిషేధాన్ని సమర్ధవంతంగా అమలు చేయ డంలోనూ ఆయా దేశాలు విఫలమ య్యాయని తెలిపింది. అందుకే వాటిపై దిగుమతి సుంకాన్ని విధించాలని అనుకుంటున్నామని చెప్పింది. అమెరికా ప్రతిపాదనపై భారత్‌ స్పందిస్తూ వాణి జ్యానికి సంబంధించి ఓ మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ట్రంప్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసా గిస్తున్నామని తెలిపింది. 1974వ సంవత్సరపు అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్‌ 301 ప్రకారం వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్‌టీఆర్‌) ఈ ప్రతిపాదిత చర్యను ప్రకటించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే చట్టాన్ని ఉపయోగించి చైనా దిగుమతులపై టారిఫ్‌ విధించారు. అవాంఛిత చర్యల ద్వారా అమెరికా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తు న్నాయని భావించిన దేశాలపై సుంకాలు విధించేందుకు ఈ చట్టం ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది.

ఈ ప్రతిపాదన ఇంకా సమీక్ష దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇది అమలులోకి వచ్చిన పక్షంలో అమెరికాలోకి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై ప్రభావం పడుతుంది. ప్రపంచ వాణిజ్యం మరింత అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉంది. వాణిజ్య ఒప్పందంపై అమెరికా, భారత్‌ అధికారులు చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ ప్రతిపాదన తెర పైకి రావడం గమనార్హం. -మంగళవారం ప్రారంభమైన చర్చలు గురువారం వరకూ కొనసాగు తాయి. కాగా భారత్‌, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రిటన్‌, పలు ఆగేయాసియా దేశాలు సహా మొత్తం 60 దేశాల నుంచి జరుగుతున్న దిగు మతులపై 12.5 శాతం వరకూ అదనపు సుంకాన్ని విధించాలని యూఎస్‌టీఆర్‌ ప్రతిపా దించింది. ఈ దేశాల జాబితాలో యూరోపియన్‌ యూనియన్‌, వియత్నాం, బంగ్లాదేశ్‌, థాయిలాండ్‌, కెనడా, మెక్సికో, అనేక గల్ఫ్‌ దేశాలు కూడా ఉన్నాయి. యూఎస్‌టీఆర్‌ ప్రతిపాదన ప్రకారం… బలవంతపు శ్రమ ద్వారా జరిగే దిగుమతులపై పూర్తిగా లేదా పాక్షికంగా నిషేధం విధించే దేశాలపై 10 శాతం సుంకం విధిస్తారు. ఆ మేరకు నిషేధాన్ని అమలు చేయని దేశాలు 12.5 శాతం టారిఫ్‌ చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -