Thursday, July 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్‌గా గవినోళ్ల బాలకృష్ణారెడ్డి

జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్‌గా గవినోళ్ల బాలకృష్ణారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-మక్తల్ 
నారాయణపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన జిల్లా చైర్మన్‌గా మక్తల్‌కు చెందిన సీనియర్ నాయకుడు, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ల బాలకృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని నారాయణపేటలో నిర్వహించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించిన అనంతరం ఆయనను చైర్మన్‌గా ఎన్నుకున్నారు.

జిల్లాలో కబడ్డీ క్రీడ అభివృద్ధికి సేవలందించాలనే లక్ష్యంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చూపుతున్న చొరవను గుర్తించి అసోసియేషన్ సభ్యులు ఈ బాధ్యతలను అప్పగించినట్లు సమావేశంలో పేర్కొన్నారు. గవినోళ్ల బాలకృష్ణారెడ్డి ఎన్నికను క్రీడాభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా గవినోళ్ల బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి జిల్లా చైర్మన్‌గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ పొందిన కబడ్డీ క్రీడను మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతానని చెప్పారు.

జిల్లాలోని యువ క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో జిల్లాలో క్రీడా రంగ అభివృద్ధికి అవసరమైన నిధులను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు మక్తల్‌లో నూతన స్టేడియాల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. అలాగే మండల కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా అసోసియేషన్ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తానని గవినోళ్ల బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -