గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు

నవ్యాంధ్ర రచయితల సంఘం సారధ్యంలో గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్‌- శంకరం వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు ఆగస్టు 29న ఉదయం 10 గంటలకు విజయవాడ ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో గిడుగు జాతీయ భాషా సాహిత్య కళా సేవా రంగాల పురస్కారాల ప్రదానం, తెలుగు భాషా పరిరక్షణపై కవి సమ్మేళనం వుంటాయి. నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కష్ణ సభాధ్యక్షత వహించే ఈ వేడుకలకు టి.డి.జనార్థన్‌, వైయస్సార్‌ శర్మ, కంఠంనేని రవిశంకర్‌, జెల్ది విద్యాధరరావు, శ్రీమతి కాంతికష్ణ, శంకరం, యలవర్తి ధనలక్ష్మి, కె. శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరవుతారు. వివరాలకు: కలిమిశ్రీ, 9246415150.

Spread the love