ముంబయి : గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (24) ఎంపికయ్యాడు. ఈ మేరకు టైటాన్స్ సోమవారం ప్రకటించింది. రూ.7 కోట్లకు టైటాన్స్‌కు సొంతమైన శుభ్‌మన్ గిల్ ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌ను నడిపిస్తున్నాడు. టైటాన్స్‌కు తొలి సీజన్లో 16 మ్యాచుల్లో 483 పరుగులు, రెండో సీజన్లో 17 ఇన్నింగ్స్‌ల్లో 890 పరుగులు చేశాడు గిల్. గత సీజన్లో మూడు సెంచరీలు బాదిన గిల్.. టైటాన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పాండ్య ముంబయికి వెళ్లటంతో యువ క్రికెటర్ గిల్‌ను కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు. కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, డెవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్దిమాన్ సాహా వంటి సీనియర్ క్రికెటర్లకు యువ గిల్ నాయకుడిగా వ్యవహరించనున్నాడు.