నామినేషన్ దాఖలు చేసిన గీత

నవతెలంగాణ-ఆమనగల్ : కల్వకుర్తి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి తరఫున ఆయన సతీమణి గీత గురువారం కల్వకుర్తి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆచారి ప్రచారంలో బీజీగా ఉన్నందున బీజేపీ రాష్ట్ర నాయకులు కండె హరిప్రసాద్, సీనియర్ న్యాయవాది చిందం కృష్ణయ్య, ఎస్సీ సెల్ నాయకులు జంతుక జానయ్య తదితరులతో కలిసి ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
Spread the love