లఢఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వండి

లఢఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వండి– కార్గిల్‌లో నిరాహార దీక్షలు
కార్గిల్‌ : కేంద్ర ప్రభుత్వ తీరుపై కార్గిల్‌లో ప్రజానీకం నిరసన గళమెత్తారు. లఢఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (కెడిఎ) ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ నిరాహార దీక్షలు ప్రారంభయ్యాయి. మూడు రోజుల పాటు ఈ దీక్షలు కొనసాగుతాయని కెడిఎ నేతలు తెలిపారు. దీక్షలకు మద్దతుగా వివిధ సామాజిక తరగతులకు చెందిన ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మరోవైపు సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరాహార దీక్ష ఆదివారం నాటికి 19వ రోజుకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో లేకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో చర్చలు జరిగినా..అవి ఏ కోశాన ముందుకు సాగడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష ధోరణిని వ్యతిరేకిస్తూ నిరాహారదీక్ష చేపట్టారు. అమిత్‌ షాతో జరిగిన చర్చల్లో కెడిఎ నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఒక రాజసభ స్థానం ఇవ్వాలని కూడా వీరంతా డిమాండ్‌ చేస్తున్నారు. జమ్ముకాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి రెండు ముక్కలుగా విడగొట్టిన తర్వాత లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జమ్ముకాశ్మీర్‌లోనూ, లడఖ్‌లోనూ ఆందోళనలు కొనసాగుతూనేవున్నాయి. బిజెపి, దాని భజనపరులు చెబుతున్నట్లుగా అక్కడేమీ శాంతిసమీరాలు వీయడం లేదు. నిత్యం నిరసనలు కొనసాగుతూనేవున్నాయి. సైనిక ఆంక్షల మధ్యన జనం నలిగిపోతూనేవున్నారు.

Spread the love