ప్రశ్నించే గొంతునవుతా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి..

– బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి శివారులో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం రోజున కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ దేశంలో ఈఎంపీని ఈ గ్రామంలో తమ గ్రామాలకు రానీయకుండా ఉండి వెంట తరుముతూ ఉన్న ఏకైక ఎంపీ అరవింద్ అని అటువంటి దౌర్భాగ్యుడు నిజామాబాద్ ఎంపీ అయ్యాడు తప్ప ఇంతసేపు అబద్ధాలు వాగడం తప్ప నిజమా బాద్ ప్రజలకు చేసింది ఏమీ లేదని పసుపు బోర్డు తెస్తా అని రెండుసార్లు మోసం చేశాడని గత ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసిచ్చాడని ఈసారి ఎన్నికల్లో ఓ ప్రధానితో నోటిమాట చెప్పించాడే తప్ప ఎక్కడ కూడా భూమి చూడలేదని కనీసం దానిమీద ఒక కమిటీ వేయలేదని దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కడ చేయలేదని ఆయన పై ఘాటుగా విమర్శించాడు. ఈ రాష్ట్రానికి మరొక దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఉన్నాడని కేవలం నోటిమాటలు బి ఆర్ ఎస్ పార్టీని విమర్శించడం తప్ప ప్రజాపాలన చేత కాదని ఇంతసేపు కేసీఆర్ కుటుంబం పైన ఆడిపోసుకోవడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదని తెలంగాణకు మరో ఏక్ నాథ్ షిండేగా తయారయ్యాడని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిలబడదని రేవంత్ రెడ్డి కొందరి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లి బిజెపిలో చేరుతాడని ఆయన తెలిపాడు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం అరవింద్ కు బదిలీ కావడం వల్లనే గెలిచాడు తప్ప నిజమైన గెలుపు కవితమ్మదేనని ఈసారి కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం బిజెపికి బదిలీ చేసేలా లోపకారి ఒప్పందం పెట్టుకున్నారని అందుకే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మన జిల్లాలో బోధన్ ముఖ్యంగా ఒక డమ్మీ క్యాండిడేట్లు పెట్టి బిజెపితో లోపాయి కారి  ఒప్పందంతో సుదర్శన్ రెడ్డి గెలిచాడే తప్ప అది కూడా చోటామోటా మెజార్టీతోనే గెలిచాడని ఈసారి కూడా ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ పదవున్న వ్యక్తిని తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబడుతుందని ఈసారి కూడా సుదర్శన్ రెడ్డి మళ్ళీ అరవింద్ గెలిపించే విధంగా చూస్తాడని ఆయన తెలిపారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగో ఓడించారు ఈసారైనా తనని గెలిపించాలని పార్లమెంట్ సెషన్ లో ఢిల్లీలో ఉంటానని తర్వాత ప్రతి గల్లి గల్లి తిరుగుతానని ప్రజల సమస్య గురించి పోరాడుతానని నా జీవితం మొత్తంలో పోరాటాలు ఎక్కువ అని ఒకప్పుడు నక్సలైట్లతో పోరాడానని ప్రజల అభివృద్ధి కోసం ఎంత దూరానికైనా వెళ్తానని, కార్యకర్తలకు బిజెపి కాంగ్రెస్ వారికి కూడా ఓట్లు అడగండి వారు కూడా పార్లమెంటు ఎలక్షన్లో మన పార్టీకి వేస్తారని ప్రొద్దున రెండు గంటల సమయం సాయంత్రం రెండు గంటలకు 45 రోజులు కష్టపడితే రానున్న ఐదు సంవత్సరాల్లో మీ గోవర్ధన్ ఎంపీగా ఉంటాడని ఇంతకుముందు లాగే ఏ కష్టం వచ్చినా తన దగ్గరికి రావచ్చని మీలో ఒకడిగా మీ మనిషిగా ఉంటానని ఆయన తెలిపాడు, అలాగే ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఎంపీగా గెలిచిన వ్యక్తి అరవింద్ మరియు  డి. శ్రీనివాస్ అటువంటి ఇద్దరు కూడా జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టారు లేనని దౌర్భాగ్యులు వారని, మన జిల్లాకు రైల్వేలో కూడా వెనుకబడి ఉందని సికింద్రాబాద్ నుండి నిజామాబాద్ వరకు డబల్ లైన్ కావాలని కానీ ఏరోజు దాని గురించి దృష్టి పెట్టలేదని అలాగే బోధన్ నుంచి బీదర్ రైల్వే లైను తరతరాల నుంచి ప్రజలు కోరుతున్న దానిని పట్టించుకునే నాధుడే లేడని, జిల్లా వాసుల కళా     జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ , ఎన్నో సంవత్సరాల నుండి జిల్లా ప్రజలు వేచి చేస్తున్న ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ సదుపాయం లేదని ఏర్పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని కచ్చితంగా నేను ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్లో కొట్లాడి కచ్చితంగా ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. మోడీకి వ్యతిరేకంగా ప్రయోగించిన అందరి పైన ఈడిని ప్రయోగిస్తున్నాడని ప్రజలలో నేరుగా ప్రతిపక్షాలను ఎదుర్కొనే సత్తా లేకనే ఈడి వీడి లాంటి రాజ్యాంగ పద్ధ సంస్థలను తన ఆధీనంలో పెట్టుకొని ప్రతిపక్షాల పైన కక్ష సాధింపుల చర్యలకు పాటుపడుతున్నాడని ఇటువంటి సంస్కృతి మంచిది కాదని, తొందరలోనే కవిత నిర్దోషిగా బయటకు వస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకుడు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, మాజీ ఎమ్మెల్సీ విజీగౌడ్ మొపాల్ జెడ్పిటిసి కమల నరేష్ మండల అధ్యక్షుడు మోచ్చ శ్రీనివాస్ , న్యాల్కల్ శ్రీనివాసరావు, కెసిఆర్ సేవాదల్ అధ్యక్షుడు కొర్వ దేవేందర్ మాజీ సర్పంచ్లు ఇందూరు సిద్ధార్థ, ముత్యంరెడ్డి, సాయిరెడ్డి, కోల గంగాధర్, మాజీ చైర్మన్ ఉమాపతి రావు, మరియు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Spread the love