– గాయంతో ఐపీఎల్18కు దూరం
అహ్మదాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)18వ సీజన్‌లో గాయాల బెడద కొనసాగుతుంది. గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ తాజాగా ఈ జాబితాలో చేరాడు. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఫిలిప్స్..గజ్జల్లో గాయానికి గురయ్యాడు. గాయం తీవ్రత పెద్దది కాదని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రసిద్ కృష్ట తెలిపాడు. కానీ తదుపరి వైద్య పరీక్షల్లో గ్లెన్ ఫిలిప్స్ గాయం తీవ్రమైనది తేలింది. దీంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. గుజరాత్ టైటాన్స్ ఏ మ్యాచ్‌లోనూ గ్లెన్ ఫిలిప్స్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లోనూ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఫిలిప్స్ గ్రౌండ్‌లోకి వచ్చాడు.