తొలి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
42.90 అడుగులకు చేరిన నీటిమట్టం..
అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.90 అడుగులకు తగ్గడంతో జిల్లా యంత్రాంగం తొలి ప్రమాద హెచ్చరికను అధికారికంగా ఉపసంహరించింది. ఆదివారం సాయంత్రం 5.12 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.90 అడుగులకు నమోదైంది. దాంతో అమల్లో ఉన్న తొలి ప్రమాద హెచ్చరికను జిల్లా కలెక్టర్ ఉపసంహరించారు. వరద పరిస్థితులు తగ్గుతున్నప్పటికీ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగించాలని సూచించారు. గోదావరి నీటిమట్టం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి వరద
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



