Monday, August 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅగర్వాల్‌ పరిశ్రమ విస్తరణకు అనుమతులిస్తే ఉద్యమం

అగర్వాల్‌ పరిశ్రమ విస్తరణకు అనుమతులిస్తే ఉద్యమం

- Advertisement -


రంగాయిపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించాలి: సీపీఐ(ఎం)
రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.అడివయ్య
గ్రామాన్ని సందర్శించిన ప్రతినిధి బృందం
నవతెలంగాణ-తూప్రాన్/ మనోహరాబాద్

ప్రజాభిప్రాయానికి భిన్నంగా కాలుష్యకారక ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణకు అనుమతులు ఇస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమపై చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.అడివయ్య అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామంలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న గ్రామాన్ని ఎం.అడివయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ మల్లేశం, ఏ మహేందర్ రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం సందర్శించింది. పరిశ్రమ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ ప్రజలను కలసి అడిగి తెలుసుకుంది. ఈ సందర్బంగా ఎం.అడివయ్య మాట్లాడుతూ.. 2006 నుంచి పరిశ్రమలో ఉత్పత్తులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 3 సార్లు పరిశ్రమను విస్తరించారన్నారు. కాగా పరిశ్రమ నుంచి వెలవడుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయని, వాటి వలన గ్రామంలోని ప్రజలకు చర్మ వ్యాదులు, శరీరంపై దద్దుర్లు వస్తున్నాయన్నారు. భారీ వాహనాలు రాకపోకలతో రద్దీ ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్నా పరిశ్రమ యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. పరిశ్రమ ఉత్పత్తుల విస్తరణ కోసం ప్లాంట్‌‌ను విస్తరించాలనే ఆలోచనను యాజమాన్యం విరామించు కోవాలని డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 20 ఏండ్లుగా పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం వలన రైతుల పొలాల్లో పంటలు పండడం లేదన్నారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. పరిశ్రమ నుంచి వచ్చే నీళ్లు చెరువులు, కుంటలలోకి వెళ్లడం వలన చేపలు చనిపోయి మత్స్య కారులు నష్టపోతున్నారన్నారు. పర్యావరణ కాలుష్యం వలన భవిష్యత్లో గ్రామంలో పుట్టబోయే పిల్లలు అంగవైక్యంతో పుట్టే ప్రమాదం ఉందన్నారు. పరిశ్రమలో ఇప్పటికే పలుమార్లు ప్రమాదలు జరిగి అనేక మంది చనిపోయరని తెలిపారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా పరిశ్రమను విస్తరించే హక్కు పరిశ్రమ యాజమాన్యానికి ఎక్కడిదని ప్రశ్నించారు. 10-15 రోజుల నుంచి ప్రజలు ఆందోళన చేస్తున్నా జిల్లా కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. పరిశ్రమ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దత్తు ఇస్తుందని ప్రకటించారు. గ్రామాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ సందర్శించి ప్రజలతో మాట్లాడి ప్రజల అభిప్రాయన్ని ప్రభుత్వానికి తెలియచేయాలనీ డిమాండ్ చేశారు. పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, దూరప్రాంతా ప్రజలకు ఉపాది కల్పించి స్థానికులకు మాత్రం కాలుష్యన్ని ఇస్తుందని అన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులను గ్రామాభివృద్ధి కోసం ఎందుకు వెచ్చించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించే వరకు దశాల వారీగా ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడపబోయిన యాదగిరి, మాజీ ఉపసర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు బాబు తో పాటు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -