Monday, August 24, 2026
E-PAPER
Homeబీజినెస్ఆక్వా ఫీడ్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయనున్న గోద్రేజ్ ఆగ్రోవెట్

ఆక్వా ఫీడ్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయనున్న గోద్రేజ్ ఆగ్రోవెట్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌లోనే అగ్రగామి ఆక్వా ఫీడ్ సంస్థల్లో ఒకటిగా నిలిచేందుకు గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (గోద్రేజ్ ఆగ్రోవెట్) భవిష్యత్తు ఆధారిత అభివృద్ధి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఆక్వా ఫీడ్ వ్యాపారాన్ని దీర్ఘకాలికంగా మరింత విస్తరించి, బలోపేతం చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ వ్యూహంలో భాగంగా, గోద్రేజ్ అగ్రోవెట్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని (Manufacturing Capacity) విస్తరించడంతో పాటు, పరిశోధన మరియు అభివృద్ధి (R&D), సాంకేతిక ఆవిష్కరణలలో పెట్టుబడులను పెంచి, ఆక్వాకల్చర్ రైతులకు అత్యుత్తమ నాణ్యత గల దాణా అందించనుంది. మేత వినియోగ సామర్థ్యంలో (feed conversion ratios) నిరంతరం మెరుగుదల సాధించడంపై కంపెనీ చూపుతున్న దృష్టి వల్ల రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గి, దిగుబడులు మరియు లాభాలు పెరుగుతాయి. ఈ ప్రయత్నాలు కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థను కూడా మరింత బలపరుస్తాయి. దీనివల్ల భాగస్వాములు రైతులకు మరింత విలువైన పరిష్కారాలను అందిస్తూ, గోద్రేజ్ ఆగ్రోవెట్‌తో కలిసి లాభదాయకమైన, సుస్థిరమైన వ్యాపారాలను నిర్మించుకోవడానికి మార్గం సుగమమవుతుంది.

కంపెనీ అభివృద్ధి లక్ష్యాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్, ఎండీ & సీఈఓ సునీల్ కటారియా మాట్లాడుతూ, “గోద్రేజ్ ఆగ్రోవెట్‌కు చేపల మేత వ్యాపారమే అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత. మా మొత్తం యానిమల్ న్యూట్రిషన్ వ్యాపారంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాం. ఈ వ్యాపారాన్ని రెండంకెల వృద్ధితో పెంచాలని అనుకుంటున్నాం. ఈ లక్ష్యానికి అనుగుణంగానే పెట్టుబడులు పెడుతున్నాం. దీనికి తోడు కొత్త సాంకేతికతను జోడిస్తూ, పరిశోధన మరియు అభివృద్ధి (R&D) ప్రయత్నాలు చేస్తున్నాం. మొత్తానికి ఆక్వా ఫీడ్ వ్యాపారంలో ఉన్న అపారమైన అవకాశాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రంగంలో మాకు ఉన్న అభివృద్ధి అవకాశాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. మా లక్ష్యాలు చాలా పెద్దవి, వాటిని సాధించి తీరడానికి మేం కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు.

అభివృద్ధి వ్యూహంలో భాగంగా, గోద్రేజ్ ఆగ్రోవెట్ తన డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ ఇటీవల దృష్టికోన్ యాప్‌ను(Drishtikon) మరింత మెరుగైన వెర్షన్‌లో తీసుకువచ్చింది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లతో అనుసంధానం మరింత సులభంగా, సమర్థంగా మారడంతో పాటు సహకారం మరియు సేవలందించడంలో నాణ్యత పెరుగుతుంది.

ఆక్వా ఫీడ్ రంగంలో అభివృద్ధి సాధించేందుకు ఇంకా అపారమైన అవకాశాలు ఉన్నాయని గోద్రేజ్ ఆగ్రోవెట్ భావిస్తోంది. అయితే ఈ అవకాశాలు ఎంత పెద్దవిగా ఉన్నప్పటికీ, బాధ్యతాయుతంగా మరియు సుస్థిరమైన పద్ధతిలో ఈ లక్ష్యాలను సాధించేందుకు కంపెనీ పూర్తిగా కట్టుబడి ఉంది.

కంపెనీ వ్యూహంపై యానిమల్ న్యూట్రిషన్ బిజినెస్, సీఈఓ, క్యాప్టెన్ ఎ.వై రాజేంద్ర(Capt. A.Y Rajendra) మాట్లాడుతూ, “ఈ వృద్ధి అనేది బలమైన వ్యాపార ప్రాథమిక సూత్రాల ప్రాతిపదికగానే సాధ్యమవుతుందనే విషయంలో స్పష్టంగా ఉన్నాం. నాణ్యత, సేవ మరియు విలువైన పరిష్కారాల ద్వారానే విజయం సాధించడంపై మేం దృష్టి సారిస్తున్నాం. ఈ విధానం వల్ల మా రైతులు, డిస్ట్రిబ్యూటర్ భాగస్వాములు మరియు వ్యాపారానికి సుదీర్ఘకాలం పాటు మెరుగైన ప్రయోజనం చేకూరుతుందని మేం నమ్ముతున్నాం” అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -