పోలింగ్‌ డ్యూటీకి వెళ్తూ…

– పోలీసులు ఉన్న బస్సు బోల్తా.. 21 మందికి గాయాలు
భోపాల్‌: పోలింగ్‌ డ్యూటీలో పాల్గొన్న పోలీసులు ప్రయాణించిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పోలీస్‌ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 4 గంట లకు భోపాల్‌-బేతుల్‌ హైవేలోని బరేతా ఘాట్‌ సమీపంలో లారీని తప్పించే క్రమంలో ఆ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 40 మంది పోలీస్‌ సిబ్బందిలో 21 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన ఎనిమిది మంది బెతుల్‌లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలైన వారికి షాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Spread the love