జులై 7న గోల్కొండ బోనాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. జులై 7న గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జులై 29న అంబారీ ఊరేగింపు ఉత్సవంతో ముగుస్తుందని ప్రకటించారు. జులై 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, 22న ఉదయం 9.30కు రంగం కార్యక్రమాలు ఉంటాయన్నారు. 29న అక్కన్న మాదన్న ఆలయం వద్ద అంబారీపై ఊరేగింపు ఉత్సవం, ఆ తర్వాత ఘటాల ఊరేగింపు, నిమజ్జనంతో బోనాల జాతర ముగుస్తుందని మంత్రి వివరించారు. ఆషాడ బోనాలకు ఏర్పాట్లపై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావుతో కలిసి శనివారం జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్ డీలో అన్ని శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

Spread the love