హైదరాబాద్ : హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ వేదికగా ఈ నెల 26 నుంచి తెలంగాణ గోల్ఫ్ మాస్టర్స్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో 126 మంది గోల్ఫర్లు పోటీపడుతున్నట్టు నిర్వాహకులు మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలో గోల్ఫ్ టూరిజం వృద్ధి చెందేందుకు ఈ టోర్నీ ఉపయుక్తంగా ఉంటుందని పీజీటీఐ సీఈవో ఉత్తమ్ సింగ్ తెలిపారు.