
నవతెలంగాణ – మల్హర్ రావు
గోళ్లకుర్మ కార్పోరేషన్ ఏర్పాటు పట్ల అఖిల బారత యాదవ మహాసభ సంఘము నాయకులు జక్కు వెంకట స్వామి, కోడారి చిన మల్లయ్య యాదవ్,మెరుగు రాజయ్య యాదవ్,గడ్డి మల్లేష్ యాదవ్ లు హర్షం వ్యక్తం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటి,పరిశ్రమలు, శాసన సభ వ్యవవహారల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం మంత్రి శ్రీదర్ బాబుకు గొర్రె పిల్లను బహుకరించారు.ఈ సందర్భంగా మాట్లాడారు ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 16 కార్పొరేషన్ లలో అందులో ఒక్కటైన యాదవ కుర్మ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం.గోళ్లకుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల వెనకబడిన యాదవ కుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చదువుకున్న యాదవ కుర్మ యువతకు ఉపాధికి కొరకు లోన్ లు రావడం వలన వారికీ ఉపాధి లభిస్తుందని ఏది ఏమైనా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవవడం హర్షణీయమన్నారు.ఈ కార్యక్రమంలో కీర్తి రాములు యాదవ్, పర్సవెన ఆగయ్య యాదవ్,బియ్యని చిన కుమార్ యాదవ్, దండిగ కుమార్ యాదవ్,బొంతల అశోక్ యాదవ్, బొంతల కుమార్ యాదవ్ పాల్గొన్నారు.