దానిమ్మతో ఆరోగ్యం పదిలం

దానిమ్మతో ఆరోగ్యం పదిలందానిమ్మలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మని గింజల రూపంలో లేదా జ్యూస్‌ రూపంలో తీసుకున్నా ఒకే ఫలితం ఉంటుంది. ద్రానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్యూనికల్గిన్‌, ఆంథోసైనిన్లు శక్తివంతమైనవి. ఇవి ఫ్రీ రాడికల్స్‌, అస్థిర అణువులకు వ్యతిరేకంగా పోరాడతాయి.
సెల్‌ డ్యామేజ్‌ని నివారిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని అధిక యాంటీఆక్సిడెంట్‌ కంటెంట్‌ రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. మొత్తం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తం సాఫీగా ప్రవహిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కీళ్లనొప్పులు, మధుమేహం, క్యాన్సర్‌తో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి శరీరం లోపల అవయవాల్లో మంటగా ఉంటుంది. దానిమ్మ రసంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫర్మేటరీ సమ్మేళనాలు ఈ మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధించే లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయినా రోజువారీ ఆహారంలో దానిమ్మను తీసుకోవటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
దానిమ్మ రసంలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఇది చాలా అవసరం. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు జీర్ణవ్యవస్థలో హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.
రాజ్మాతో ఎన్ని ఉపయోగాలో..
రాజ్మా అని పిలవబడే వీటికి ఉన్న మరోపేరు కిడ్నీబీన్స్‌. ఫైబర్‌, కాల్షియం, సోడియం వంటి అనేక పోషకాలతో నిండి వున్నాయి. కిడ్నీ బీన్స్‌ బరువు తగ్గడంలో సహాయపడతాయి. వీటిని తరచుగా తీసుకోవడంవల్ల క్యాన్సర్‌, లివర్‌ వ్యాధుల ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఇవి జీర్ణక్రియలను మెరుగుపరిచి, ఎముకలు, దంతాల బలానికి, చర్మ ఆరోగ్యం, జుట్టు నాణ్యత కోసం ఎంతో ఉపయోగ పడతాయి. ఫోలిక్‌ యాసిడ్‌ నిక్షేపాలు అధికంగా ఉన్న కారణంగా గర్భిణీ స్త్రీలకు కిడ్నీ బీన్స్‌ అత్యంత ఉత్తమమైన పోషకాహారమని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఇవి హైపర్‌ టెన్షన్‌ ను నివారించడంలోనూ, జ్ఞాపక శక్తికి, డీటాక్సిఫికేషన్‌కూ ఎంతో సహాయపడతాయి.

Spread the love