- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పీఎం కిసాన్ 23వ విడత నిధులు జూలై నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. రైతులకు పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం 22వ విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో విడుదలవుతాయి. 22వ విడత మార్చిలో వచ్చింది కాబట్టి.. 23వ విడత జూలైలో వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -



