తిర్మన్ పల్లి విడిసి అధ్యక్షుడిగా గోపు గోవర్ధన్ నియామకం..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షులుగా గోపు గోవర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శుక్రవారం తిర్మన్ పల్లి గ్రామంలో గత గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు,నూతన కమిటీ సభ్యులు సమావేశమై ఏడాది పాటు గ్రామానికి సంబంధించిన జామ ఖర్చుల లేక్కలను నూతన కమిటీ కి అందజేశారు. అద్యక్షులుగా గోపు గోవర్ధన్,గడ్డం కిషన్, చిన్న లింగన్న, గోపురెడ్డి అనివాస్, కోత్త కుమరయ్య, ఎర్రోళ్ల సాయన్న చెక్ పావర్, కాపెట్టి రామేష్, వాడ్లురి అవినాష్, వెముల నవీన్, తెడ్డు అబ్బయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ గ్రామ అభివృద్దికి అహర్నిశలు కృషి చేస్తామని,గ్రామ సమస్యలను కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకొని పరిష్కారించడానికి కృషి చేస్తామని వారన్నారు.కలమత భేదం లేకుండా అందరిని కలుపుకొని ముందుకు వచ్చి గ్రామ అభివృద్ది ధ్యేయంగా ఉంటామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ విడిసి అధ్యక్షులు దర్పల్లి ప్రభాకర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love