నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని ప్రాజెక్ట్ నగర్ గ్రామంలో ఇటీవల వరదల్లో నష్టపోయినవారికి శుక్రవారం ప్రభుత్వం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఆర్థిక సహాయం అందించింది. ఈ సందర్భంగా ఎంపిపి సూడి శ్రీనివాసరెడ్డి హాజరై బాధితులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున పదిమందికి అందజేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటుందని వరదల సమయంలో ప్రకటించిన విధంగా ఆదుకోవడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అల్లం రాజకుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఆర్ఐ రాజేందర్, ఎంపీటీసీ వెలిశాల స్వరూప, మీడియా& సోషల్ మీడియా కోఆర్డినేటర్ పృథ్వీరాజ్ ఉట్ల,బాధితులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.