ఆర్టీసీలో సంబురాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈమేరకు ఆర్టీసీ ఫైలుకు ఆమోదం తెలియజేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్ అయిన పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు నెల రోజు క్రితం జూనియర్ అసిస్టెంట్ పోస్టుల సంబంధించి ఫైలును ప్రభుత్వానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో సర్కారు జాప్యం చేయడంతో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కార్మిక సంఘాలు సైతం ఉన్నతాధికారులకు పదే పదే వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిశాయి. సమస్యలతో కూడిన వినతిపత్రాలు పలుమార్లు అందజేశాయి. ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ల కమిటీ అంగీకరించిన అంశాలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశాయి. పీఆర్సీ బకాయిలు ఎటూ ఇవ్వడం లేదు, అంగీకరించినవైనా ముందుగా అమలుచేయాలనే విజ్ఞప్తులు సంఘాల నుంచి వస్తున్నాయి. ఈవిషయంలో కార్మికులు సర్కారుపై ఒకింత గుర్రుగా కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నరేండ్ల కాలంలో స్వల్పంగా ఆర్టీసీలో భర్తీ చేసింది. డ్రైవర్లు 1000 పోస్టులకు 894 మంది ఎంపికయ్యారు. కండక్టర్లు 743 పోస్టులకుగాను 710 భర్తీ కానున్నాయి. మొత్తం 1604 మంది నియామకం జరగనుంది. కాగా తాజాగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల విషయానికొస్తే 130 పోస్టులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి వచ్చే సెప్టెంబరు మొదటివారంలో నోటిఫికేషన్ రానున్నట్టు సమాచారం. ఈమేరకు ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్‌సిగ్నల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



