Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైద్య కళాశాలలో బోధనా అధ్యాపకుల సమస్యలను పరిష్కరించండి

వైద్య కళాశాలలో బోధనా అధ్యాపకుల సమస్యలను పరిష్కరించండి

- Advertisement -

డీఎమ్‌ఈకి టీటీజీడీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న బోధనా అధ్యాపకులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలంగాణ టీచింగ్‌ ‌గవర్నమెంట్‌ ‌డాక్టర్స్‌ అసోసియేషన్‌ (‌టీటీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ‌బొల్లెపాక కిరణ్‌, సెక్రటరీ జనరల్‌ ‌డాక్టర్‌ ‌మాదాల కిరణ్‌, జోనల్‌ ‌కార్యదర్శి డాక్టర్‌ ‌బాబు మండ, డాక్టర్‌ ‌రాజమోహన్‌, జోనల్‌ ఈసీ మెంబర్స్‌ ‌డాక్టర్‌ ‌కరుణాకర్‌, డాక్టర్‌ ‌సదానంద్‌, డాక్టర్‌ ‌జయబాబు డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌‌లో డీఎమ్‌ఈని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేయడానికి ప్రోత్సాహం కల్పించేలా పీఎమ్‌‌సీఏ అమలు చేయాలని వారు కోరారు. యూజీసీ వేతనం నుంచి బోధనా డాక్టర్లను ఎయిమ్స్‌ ‌వేతన స్కేలుకు మార్చాలని విన్నవించారు. ఎనిమిదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న డిజిగ్నేటెడ్ ప్రొఫెసర్ విధానాన్ని అమలు చేయాలనీ, పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులకు సూపర్ స్పెషాలిటీ అలవెన్స్ ప్రవేశపెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఇన్-సర్వీస్ కోటా అమలు చేయాలని విన్నవించారు. రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులకు ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలను ఇవ్వాలని కోరారు. బోధనా అధ్యాపకుల కోసం ప్రత్యేక బదిలీ విధానాన్ని రూపొందించాలని విన్నవించారు. పోస్టుమార్టం అలవెన్స్‌ను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -