కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ వైద్యం : మంత్రి

నవతెలంగాణ-ఏటూరు నాగారం ఐటిడిఏ
ఏజెన్సీలోని ప్రజలకు కార్పొరేట్‌స్థాయిలో వైద్య సేవలు మరింత చేరువయ్యేలా విస్తృత పరుస్తామని స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రి ఆవరణలో తెలంగాణ డయాగస్టిక్‌ హబ్‌ను జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌, ములుగు ఎమ్మెల్యే ధనసరి అన సూయ సీతక్క, ట్రైకార్‌ చైర్మన్‌ రాంచంద్రునాయక్‌, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్‌ వాల్యనాయక్‌, ఐటీడీఏ పీవో అంకిత్‌, ఎస్పీ గౌస్‌ ఆలం, జిల్లా అదనపు కలెక్టర ఇలా త్రిపాఠి, జెడ్పి వైస్‌ చైర్మన్‌ బడే నాగజ్యోతిలతో కలసి ఘ నంగా ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాజిక ఆస్పత్రిలో మాత శిశు ఆస్పత్రిని ఇప్పటికే నిర్మించుకుని ఉన్నా మని, ఇప్పుడు అదనం రూ.1.20కోట్లతో తెలంగాణ డయా గస్టిక్‌ హబ్‌ను ప్రజల సేవలోకి తీసుకువస్తున్నామన్నారు. మిషనరీ కూడా త్వరలోనే వస్తుందన్నారు. సామాజిక ఆస్పత్రి వైద్యుడు సురేష్‌ కుమార్‌ సేవలు అభినందనీ య మన్నారు. ఏజెన్సీలో పనిచేస్తూ ఆస్పత్రి నిర్వాహణ బాగుం దన్నారు. రాష్ట్రంలోని ఐటీడీఏ ద్వారా మంజూరు అయిన ఎకనామికల్‌ సపోర్ట్‌ స్కీం ద్వారా ఇప్పటికే ఎంపిక కాబడిన వారికి రుణాలు ఇచ్చేందుకు పాతబకాయిల కింద రూ. 140 కోట్లు మంజూరు చేశామని, రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ. 100ల కోట్లు నిధులు ఇచ్చి గిరిజనులకు ట్రైకార్‌ద్వారా కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వనున్లట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అకాశమే హద్దుగా దశాబ్ధి ఉత్సవాలను జరుపుకునేందుకు జిల్లా యంత్రాంగం, ప్రజలు సిద్ధమై ఉండాలని, జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు గొప్పగా జరుపుకునేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. 75 సంవత్సరాల పాలనలో సాధిం చుకోలేని అభివృద్ధిని 9 ఏళ్ల పాలనలో చేసుకున్నామని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఎదో ఒక పథకం వచ్చిం దన్నారు. ములుగు జిల్లా అభివృద్ధికి కంకణబద్దులై ఉన్నామన్నారు. మేడారం జాతరలో ఇప్పటి వరకు రూ.450 కోట్ల వరకు ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా మన్నారు. రాబోయే 2024 జాతరలో కోట్లాది మంది భక్తులు ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకొని సుఖంగా తిరిగి వెళ్లేలా పక్కా ప్లాన్‌ చేస్తున్నామన్నారు. అందు కోసమే మేడారం పూజారులు పది నెలల ముందుగానే జాతర తేదీలను ప్రకటించారన్నారు. ఎన్ని రకాల వసతులు కల్పిం చాలనేది ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ పోరిక గోవింద నాయక్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, డీఆర్‌ఓ రమాదేవి, జడ్పీ సిఈ ఓ ప్రసూన రాణీ, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, జడ్పీ కోఆప్షన్‌ వలియాబీ, కన్నాయిగూడెం జెడ్పీటీసీ నామ కరం చంద్‌ గాంధీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ హేమలత, స్థానిక సర్పంచ్‌ ఈసం రామ్మూర్తి, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్‌, పార్టీ మండల అధ్యక్షుడు సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
నూతన భవనాలను మంత్రి ప్రారంభం
నవతెలంగాణ – ములుగు
కన్నాయిగూడెం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం భవనాన్ని , ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌, ములుగు శాసన సభ్యురాలు ధనసరి అనసూయ సీతక్క, ట్రై కార్‌ ఛైర్మెన్‌ రాంచెంద్రు నాయక్‌, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్‌ వాల్య నాయక్‌, ఐటీడీఏ పీవో అంకిత్‌, ఎస్పీ గౌస్‌ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జెడ్పి వైస్‌ చైర్మన్‌ బడే నాగజ్యోతితో కలసి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయ వంతగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో మంత్రి కేక్‌ కట్‌ చేసి, జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా యంత్రాంగం ను, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ పోరిక గోవింద నాయక్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, డిఆర్‌ఓ కే రమాదేవి, జడ్పీ సిఈ ఓ ప్రసూన రాణీ, డిఅండ్హెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య, జడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ వలియ బి, జడ్పిటిసి నామ కరం చంద్‌ గాంధీ, ఎంపీపి జనగాం సమ్మక్క, ఈఈ ట్రైబల్‌ వెల్ఫేర్‌ హేమలత, మండల ప్రత్యేక అధికారి డిపిఓ వెంకయ్య, తహసిల్దార్‌ ఇంఛార్జి రామ్‌ సింగ్‌ , ఎంపిడిఓ ఫనిచంద్ర, సర్పంచ్‌ చిదరి మౌనిక, సంబంధింత అధి కారులు, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love