Thursday, June 4, 2026
E-PAPER
Homeనల్లగొండప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి

ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి

- Advertisement -
  • జిల్లా విద్యాశాఖాధికారి సుశీంధర్ రావు

నవతెలంగాణ-హలియా: ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని మండల ప్రత్యేక అధికారి జిల్లా విద్యాశాఖాధికారి సుశీంధర్ రావు అన్నారు. చింతగూడెం గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. గ్రామ పారిశుద్ధ్యం, పంట మార్పిడి, కరెంటు, రాబోయే వర్షాకాలంలో గ్రామంలో వచ్చే సమస్యలు మరియు ప్రభుత్వ పాఠశాల యొక్క బలోపేతం చేయడం గురించి వివరించారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందె వివిధ పథకాలను వివరించడం జరిగింది. ఈ గ్రామ సభలో మండల అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి, గ్రామ సర్పంచ్ అంజయ్య, మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రయ్య, గ్రామసభ ఇంచార్జ్, గ్రామపంచాయతీ సెక్రటరీ, గ్రామ ఉపసర్పంచ్ , గ్రామ వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు పాల్గన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -