Monday, August 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మరకత లింగ సోమేశ్వరుని సేవలో ప్రభుత్వ విప్ బీర్ల  

మరకత లింగ సోమేశ్వరుని సేవలో ప్రభుత్వ విప్ బీర్ల  

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పరిధి చందిప్ప గ్రామంలోని ప్రముఖ ప్రాచీన శైవక్షేత్రం శ్రీ మరకత లింగ సోమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్యకు ఆలయ అర్చకులు, సిబ్బంది సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.

రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మన రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను బీర్ల అయిలయ్యకి, కుటుంబ సభ్యులకు అందజేసి ఆశీర్వదించారు. 

భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బీర్ల అయిలయ్య  వెంట కుటుంబ సభ్యులు, ఆలయ అర్చకులు, నిర్వాహకులు, స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -