గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి 

– సీపీఎం జిల్లా కార్యదర్శి  రమేష్ బాబు..
నవతెలంగాణ – మాక్లూర్
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 28వ రోజు జరుగుతున్న విషయం తెలిసిందే. బుదవారం మండల కేంద్రంలో సమ్మె నిర్వహిస్తున్న రామపంచాయతీల కార్మికులకు సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు సంఘిబావం ప్రకటించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ 28 రోజుల నుండి గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె నిర్వహిస్తూ ఉంటే సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి వెంటనే చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, శాసనసభ్యులు మంత్రులు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యలను చర్చించి పరిష్కార దిశగా ఆలోచించాలని, లేనియెడల గ్రామీణ ప్రాంతాల్లో కలుషిత వాతావరణం పెరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా సమస్యలను పరిష్కరించలెని ఎడల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సి వస్తుందని అందుకు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ  మండల నాయకులు బాలకిషన్, బాలరాజు, ప్రశాంత్ నర్సారెడ్డి, శ్రవణ్, ప్రసాద్ తదితరులతోపాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.
Spread the love