చదువుతోనే ఉన్నత అవకాశాలు సాధ్యం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

– ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందిస్తాం
– మెడికల్ కాలేజీ మల్లాపురం లోనే నిర్మిస్తాం
– గుడి కట్టడానికి రూ.10 లక్షల రూపాయలు విరాళం
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
చదువుతూనే ఉన్నత అవకాశాలు సాధ్యం అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం, యాదగిరిగట్ట మండలం మల్లాపురం దేవనయకుల మర్రి, ప్రభుత్వం అధికారికంగా సద్గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ అందరికీ ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ అన్నారు. ఆరోజుల్లో మాంసం, ఆల్కహాల్ తీసుకోవద్దని ప్రజలకు దిశ నిర్దేశం చేశారు అని అన్నారు. పేద ప్రజలు చదువుతూ ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని, ఇప్పుడు చదువుతూనే అన్ని రకాల పనులు సాధ్యమవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేసి అందరికీ అంతరాలు లేని విద్యను అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందజేస్తామని అన్నారు. చదువు అన్ని వ్యవస్థలు నడవడానికి మూలం అన్నారు.  అప్పట్లో రిజర్వేషన్ తీసుకువచ్చి విద్య, ఉద్యోగాలలో గిరిజనులకు సమాన అవకాశాలు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. గుడి కట్టడానికి స్థలం ఇస్తామని మాట ఇస్తున్నాం అన్నారు. గుడి కట్టడానికి 10 లక్షల రూపాయలు విరాళం కూడా ఇస్తాను అన్నారు. వచ్చే సంవత్సరం జయంతి ఉత్సవాలలో గుడికి పునాది వేద్దాం అన్నారు. పార్టీలకతతంగా తండాలను అభివృద్ధి చేస్తానని అన్నారు. మెడికల్ కాలేజీ మల్లాపురం గ్రామంలోనే నిర్మిస్తామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అబద్ధపు ప్రచారాలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం బంజారాలు కోరిన సెలవును ప్రకటించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతిని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే, సురేష్, జడ్పీ సీఈవో శోభారాణి, జడ్పీ వైస్ చైర్మన్ బీకూ నాయక్, శంకర్ నాయక్, ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పిటిసి తోటకూర అనురాద, ఎంపిటిసి కర్రే విజయ వీరయ్య, ఉమ్ల నాయక్, కళ్లెం జహంగీర్ గౌడ్, మండల కోఆప్షన్ మెంబర్ యాకుబ్, శిఖ అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love