శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్..

నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ కు ఆలయ అర్చకులు భాజ భజంత్రీలు మంగళ వాయిద్యాలు, మధ్యన పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రీ  వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి ఆలయం మన ప్రాంతంలోనే అతి పురాతనమైన ఆలయంగా వెలుగొందుతుందన్నారు.మన హైందవ మతం అనుసరించి మన తాత ముత్తాతల నుండి గ్రామాల్లో దేవాలయాలు నిర్మిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. శ్రీ స్వామీ వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ, ఎలాంటి కీడు లేకుండా అందరూ బాగుండాలన్నారు.అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి చిత్రపటం బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలాధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్,సోయినేని కర్ణాకర్,రూరల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోయనేని లహరి, గోస్కుల రవి, అన్నారం శ్రీనివాస్, దేవస్థాన కమిటీ చైర్మన్ సంపేట గంగారాజు, వైస్ చైర్మన్ రాఘవరెడ్డి, పొన్నం బాలయ్య, కమిటీ సబ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love