Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సమస్యల పరిస్కారం కోసమే గ్రామసభ

ప్రజా సమస్యల పరిస్కారం కోసమే గ్రామసభ

- Advertisement -

ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రజా సమస్యల పరిస్కారం కోసమే ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోందని గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల  కార్యక్రమంలో భాగంగా ముగింపు గ్రామసభను గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జై.బాపూరావు,ఎంపీడీవో క్రాంతి కుమార్,కొయ్యుర్ ఎస్ఐ-2 రాజన్ కుమార్,ఎంఈఓ లక్ష్మణ్ బాబు హాజరై మాట్లాడారు రానున్న వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ద్రవ,ఘన వ్యర్థాల నిర్వహణ,జల సంరక్షణ, పారిశుధ్యం,ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.గ్రామంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు,పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి,వార్డు సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -