నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలో పందిల్ల గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఈజీఎస్ పథకంలో మంజూరైన రూ.20 లక్షల రూపాయలతో చేపట్టే పనులపై బుధవారం గ్రామంలో ప్రత్యేక అధికారి, తహసిల్దార్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తహసిల్దార్ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి సిబ్బందితో గ్రామంలో ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పనుల తీరును కొనసాగిస్తూన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జయలక్ష్మి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.