సమగ్రమైన చేనేత పాలసీ రూపొందించాలి

– చేనేతకు రాష్ట్ర బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించాలి
– చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
తెలంగాణ చేనేత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లాకమిటి అధ్వర్యంలో బుధవారం రోజున జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘాల్లో నిలువ ఉన్న  కార్మికుల వద్ద ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలని కోరారు. చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరిపించి టెస్కో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర బడ్జెట్లో రూ.1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి వృత్తిరక్షణ వృత్తిదారుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని కోరారు. చేనేత ముడి సరుకులుపై కేంద్ర ప్రభుత్వం వేసిన జీఎస్టీని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసులు చేయాలని కోరారు. గత ప్రభుత్వ పథకాలను కూడ కొనసాగించాలని, నేతన్న భీమా స్కీమ్ లో ఉన్న వయోపరిమితిని తొలగించి అందరికీ వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వ సిబ్బందికి, విద్యార్థుల యూనిఫారాలకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లకు చేనేత వస్త్రాలు బహుకరించి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. ప్రతి చేనేత కార్మికునికి ఈఎస్ఐ పిఎఫ్ హెల్త్ కార్డులు అమలు చేయాలని అన్ని రకాల చేనేత రుణాలు మాఫీ చేసి, 80 శాతం రాయితీతో ఉత్త రుణాలు ఇవ్వాలని ప్రతి చేనేత కార్మికునికి స్థలమిచ్చి ఇల్లు వర్క్ షర్ట్ నిర్మాణానికి రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. టెస్కో నుండి సహకార సంఘాలకు రావలసిన పెండింగ్ డబ్బులు వెంటనే ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అన్ని మగ్గాలకు అనుబంధ వృత్తులకు జియో టాగ్ వేసి చేనేత యాప్ తో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం,జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు, జిల్లా కమిటీ సభ్యులు, బొడ ఆంజనేయులు, గట్టు రాజు లు  పాల్గొన్నారు.
Spread the love