ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతోనే ఎంపీగా దరఖాస్తు చేసుకున్న

– మా నాన్నే నాకు ప్రేరణ
– యువ పారిశ్రామికవేత్త కుంభం కీర్తి రెడ్డి
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
దేశానికి సేవ చేయాలనే ఆలోచనతోనే గాంధీభవన్లో భువనగిరి పార్లమెంటు స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు యువ పారిశ్రామికవేత్త  కుంభం కీర్తి రెడ్డి తెలిపారు. మా తాత గారి నుంచి మా కుటుంబం ఏదోరకంగా ప్రజలను సేవ చేస్తూ ఉండేదని, తాత గారి బాటలో మా నాన్నగారు గత 20 సంవత్సరాలుగా అనేక  సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. 15 సంవత్సరాలుగా రాజకీయాల కోసం నాన్న ఎంతో కష్టపడ్డారని ప్రజల కోసం పని చేశారని అన్నారు. మా నాన్న  ఎమ్మెల్యే కుంభం అనిల్  కుమార్ రెడ్డి స్ఫూర్తితోనే  ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు.బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం యువశక్తి లో నెంబర్ వన్ స్థాయిలో ఉందన్నారు. మన యువశక్తిని చూసి ఇతర దేశాల వారు టాప్ టెన్ కంపెనీలను భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నారు అన్నారు.  ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో విజయం సాధించారని అన్నారు. దేశానికి యువత కొత్త ఆలోచన కొత్త వరవడిని సృష్టించేందుకు సీనియర్ల సలహాలు తీసుకొని, ముందుకు నడవనున్నట్లు తెలిపారు.
విద్యా,  వైద్యం అందరికీ అందించాలని నా లక్ష్యం....పేదవారికి ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందించాలని లక్ష్యంగా  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య బీమా 10 లక్షలకు పెట్టడం సంతోషకరమైన  విషయం అన్నారు. బీబీనగర్లో ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పదవ తరగతి బాలికలకు  అవగాహన అవసరం…. పదవ తరగతి నుంచి డిగ్రీ చేస్తున్న విద్యార్థులకు ప్రతి క్లాసులో ఒక మెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. అమ్మాయిలు కొన్ని తల్లిదండ్రులకు గురువులకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయని, వాటిపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలలో మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. సామాన్యులకు విద్య,  వైద్యం పూర్తిస్థాయిలో  అందుబాటులో రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, తద్వారా ప్రజలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని, ఉన్నత విద్యను అభ్యసిస్తారని ఆమె అన్నారు. ఏరియా ఆసుపత్రిని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తానని అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అన్ని రంగాలలో  అమలు చేయాలని, దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు అయ్యేందుకు,  ప్రజల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు.
Spread the love