భువనగిరిని హైదరాబాద్ సిటీ మోడల్ గా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

నవతెలంగాణ –  భువనగిరి రూరల్ 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ సిటీ లాగా మోడల్ నియోజకవర్గంగా  తీర్చిదిద్దుతానని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు 40 సంవత్సరాల చరిత్రను తిరగరాసి, భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేశారని, వారికోసం శక్తివంతన లేకుండా కృషిచేసి, భువనగిరి నియోజకవర్గం లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి, ప్రజలకు సేవ చేయనున్నట్లు, హైదరాబాదులో ట్యాంక్ బండ్ లాగా ప్రతి మండలంలో ఒక ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రేరణతో రాజకీయాల్లోకి…
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో వలిగొండ దేవాలయంలో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మీరు రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరగా, ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి  వచ్చారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు భువనగిరి జిల్లా దగ్గరలో ఉందని ఐటీ రంగాన్ని ప్రోత్సహించనున్నట్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం లాగా కాకుండా ప్రజల వద్దకే పాలన అందిస్తామని, సంక్షేమ పథకాలలో అర్హులు ఉంటే ఎవరి ఫైరవీలు లేకుండా వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గతంలో పనిచేసిన కాలంలో ప్రస్తుత  ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సుమారు రెండు కోట్ల పైగా నిత్యవసర సరుకులు పంపిణీ చేసి, బాధితులకు అండగా నిలిచారు.
కుంభం ఫౌండేషన్ ద్వారా బాధితులకు చేయూత..నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక సహకారం అందించారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కరోనా సమయంలో ప్రజలు   భయభ్రాంతులకు గురవుతుంటే కుంభం  అనిల్ కుమార్ రెడ్డి  రోగుల కోసం అంబులెన్స్లు ఏర్పాటు చేసి, వారికి వైద్య సహాయం అందించారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత సమయంలో సొంత డబ్బులతో ఎంతోమంది పేదవారికి సిలిండర్లను అందజేసి సుమారు వందకు మందికి పైగా ప్రాణాలను కాపాడారు.  2018 వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ, ఏ మాత్రం అధైర్యం పడకుండా కార్యకర్తలకు భరోసానిస్తూ, వారికి అండగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి ప్రమాదం సంభవించినప్పుడు  వారి వైద్య ఖర్చులను  భరించి వారిని ఆదుకున్నారు.
అలుపెరుగని పోరాటం..నియోజకవర్గ సమస్యలపై కుంభం   అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా బునాది గాని కాలువ కోసం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. బీబీనగర్ ఎయిమ్స్ కోసం ఎయిమ్స్ నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు. తిమ్మాపురం నిర్వాసితులకు అండగా నిలిచారు. తిమ్మాపురం భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపి, గతంలో వారికి  నష్టపరిహారం రావడానికి కృషి చేశారు.
నాటి పోరాట ఫలితమే నేడు ఎమ్మెల్యేగా గెలుపు..15 సంవత్సరాలుగా రాజకీయాలలో సేవ చేస్తూ, 9 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ సమస్యల పైన  అలుపెరుగని పోరాటం చేశారు. ప్రజల నుంచి ఆయనకు మంచి స్పందన లభించింది.  కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేసిన అనేక సేవా కార్యక్రమాలకు ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికలలో  ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారు.
భువనగిరి  నియోజవర్గ అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క: మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు కలిసి నియోజకవర్గానికి  నిధులు కేటాయించాలని  కోరారు.
నియోజకవర్గం అభివృద్ధి కోసం సమీక్షలు..
తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శంగా నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులతో నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, అధికారులకు దిశా, నిర్దేశం చేస్తున్నారు. భువనగిరి నియోజవర్గం అభివృద్ధి చెందేందుకు    అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. తనపై నమ్మకం వచ్చి గెలిపించినందుకు తమపై మరింత బాధ్యత పెరిగిందని, అందుకు భువనగిరి ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు.
Spread the love